హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘జేసీబీతో అక్రమంగా మట్టి తవ్వకాలు’

BDK: అశ్వాపురం మండలంలోని చింతలచెరువులో అనుమతులు లేకుండా జేసీబీతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.600 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి, వాహనాలను సీజ్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.