హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు

BHNG: ఆలేరు మండలం కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులుతీరి సోమేశ్వరుడు, కోటొక్క లింగం, చండికాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.