హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రారంభం

SDPT: బెజ్జంకి మండలం వడ్లూరులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని మంగళవారం సర్పంచ్ పులి రమేష్ గౌడ్ ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమోదు కోసం బీమాదారుడు, నామినీ ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులతో పాటు ఫోన్ నంబర్లు తీసుకురావాలని సూచించారు.