SRCL: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. మంగళవారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో బాధ్యతగా ఉండాలన్నారు.
తెలంగాణ
'ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి'


