హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

TPT: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి కార్తీక దీపారాధనలు నిర్వహించారు. దీపాలు వెలిగిస్తూ శివనామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.