హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం నిర్ణయం ఉపసంహరించుకోవాలి'

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పార్లమెంట్‌లో ప్రకటించాలని స్టీల్‌ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. డిసెంబరు 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం ఎదుట కార్మికులు మానవహారం నిర్వహించారు. సొంత గనులు కేటాయించాలని కోరారు.