హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం ఐనంపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి శీలం నిర్మల కుమారి ఖరారైన సందర్భంగా పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆమెకు మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మల కుమారికి అభినందనలు తెలిపి, ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.