హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టైపింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన బాలిక అదృశ్యం

గుంటూరులో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలిక పదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం టైపింగ్ నేర్చుకుంటోంది. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తల్లి ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.