హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢీకొన్న రెండు లారీలు.. ఇద్దరు సజీవ దహనం!

AKP: సబ్బవరం రహదారిపై బాట జంగాలపాలెం సమీపంలో ఇవాళ ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీకి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.