హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివాలయంలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక పూజలు

PPM: కార్తీక పౌర్ణమి సందర్బంగా రాష్ట్ర శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లాలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు.