KKD: సామర్లకోట పంచారామ భీమేశ్వర ఆలయంలో మంగళవారం ఓ మహిళా భక్తురాలు ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డారు. స్వామివారి దర్శనం అనంతరం కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో పీటపై అడుగు వేయడంతో ఆమె కిందపడినట్లు భక్తులు తెలిపారు. ఈ ఘటనలో మహిళ కాలికి గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భీమేశ్వర ఆలయంలో మహిళా భక్తురాలికి గాయాలు


