హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓ వైపు నీటి ఎద్దడి.. మరోవైపు వృథాగా తాగునీరు!

కర్నూలు: ఆదోని పట్టణంలోని ప్రధాన రహదారిపై షాపింగ్ మాల్ ఎదుట తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పారుతోంది. ఓ వైపు పట్టణంలో నీటి ఎద్దడి ఉందని చెబుతున్న అధికారులు, మరోవైపు నీటి వృథాను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ పగిలి నీరు రోడ్డుపై ఏరులై పారుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.