హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తి అనుమానాస్పద మృతి

కోనసీమ: పి.గన్నవరం మండలంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చనిపోయిన చోటే మృతదేహాన్ని తగలబెట్టినట్లు తెలుస్తోంది. అయితే మృతదేహం పూర్తిగా దహనం కాలేదు. మృతుడు రాంబాబు (51)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.