PLD: వాహనదారులు అతివేగాన్ని వీడి నెమ్మదిగా ప్రయాణిస్తూ సురక్షితంగా ఇంటికి చేరాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి సూచించారు. ఇంటి వద్ద మీ కోసం ఒక కుటుంబం ఎదురుచూస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అతివేగం ప్రాణాంతకం.. నిబంధనలు పాటించండి: ఎస్పీ


