హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

43 వార్డులో కేంద్ర మంత్రి ప్రచారం

SKLM: నగరంలోని విశాఖ-బీ కాలనీలో కూటమి ఎన్నికల ప్రచారం సాగింది. మంగళవారం జరిగిన ఈ ప్రచారంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పాల్గొని, 43వ డివిజన్ టీడీపీ అభ్యర్థిని అంబటి అమ్మాజమ్మను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదిస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.