KDP: పులివెందుల మండలం రాగిమానుపల్లెలో కాలువల మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాగిమానుపల్లెలో రోడ్లపై మురుగునీరు


