బాపట్ల: చీరాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, కుటుంబాలపై పడే ప్రభావాన్ని వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే 1972 నంబర్‌కు కాల్ చేయాలని ఈగల్ టీం సభ్యులు సురేష్, బషీర్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్ డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల కార్ స్టాండ్‌లో ఈగల్ టీం అవగాహన కార్యక్రమం


