హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ప్రాంతాల్లో మద్యం బంద్!

గుంటూరు: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ, పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఇవాళ సాయంత్రం నుంచి 26న పోలింగ్ ముగిసే వరకు విక్రయాలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ తెలిపారు. నవంబరు 30న కౌంటింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు నుంచి మద్యం విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.