హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తీగలతో కప్పుకుపోయిన విద్యుత్ నియంత్రిక

W.G: పెంటపాడు మండలం ఆకుతీగపాడు స్వర్ణ గ్రామ సచివాలయం సమీపంలోని విద్యుత్ నియంత్రిక పొదలు, తీగలతో పూర్తిగా కప్పుకుపోయి ప్రమాదకరంగా మారింది. విద్యుత్ నియంత్రిక చుట్టూ పిచ్చిమొక్కలు, తీగలు అల్లుకోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు