అన్నమయ్య: రాయచోటి శివనంది సర్కిల్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే జాతీయ రహదారిపై భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఉమామహేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు


