హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసింగపాడులో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

పల్నాడు: నకరికల్లు మండలం నరసింగపాడులోని దక్షిణ కాశీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో కిటకిటలాడింది.