VZM: భోగాపురం మండలం సుందరపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండటం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురం రోడ్డు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి


