హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శబరిమల యాత్రలో విషాదం..!

TPT: తమిళనాడులోని మైలం వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. మృతులను తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పాదిరికుప్పంకు చెందిన లక్ష్మీపతి, తమిళనాడు గుమ్మడిపూడి వాసి ముకుందన్‌గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దిండివనం, విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.