హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దత్తాత్రేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కృష్ణా: కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి దీపారాధనలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.