ప్రకాశం: మార్కాపురం ప్రాంతంలోని శివాలయాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీక పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులు కిటకిటలాడారు. కొమరోలు మండలంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి పాలాభిషేకం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్తీక పౌర్ణమి సందర్భంగా కిక్కిరిసిన భక్తులు


