KDP: కార్తీక పౌర్ణమి సందర్భంగా బి.కోడూరు మండలం మేకవారిపల్లెలోని 108 శివలింగాల క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పవిత్ర కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం 108 శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
108 శివలింగాల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు


