హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడరేవులో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

బాపట్ల: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని వాడరేవులో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, బాలకొండమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్, యువనేత గౌరీ అమర్నాథ్‌లతో కలిసి వాడరేవు, రామాపురం తీరాల్లో పర్యటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తల తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.