హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్రెండ్ యాప్‌తో మొదలై.. జైలుకు!

ELR: కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటకు చెందిన పేట వసంత్ (25)పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫ్రెండ్ యాప్ ద్వారా 35 ఏళ్ల గృహిణికి పరిచయమైన వసంత్ స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. వీడియో కాల్స్ తో తాను ధనవంతుడిగా నమ్మించాడు. ఆమె వద్ద నుంచి 20 గ్రాముల మంగళసూత్రాన్ని తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.