ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 26న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సెట్విస్ సీఈఓ రమ్య తెలిపారు. 15-29 ఏళ్ల యువతీ యువకులు అర్హులని, జానపద గేయాలు, నృత్యాలు, కవిత్వం, చిత్రలేఖనం, వీధి నాటకాలలో పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని, జాతీయ పోటీలు 2027 జనవరి 12న ఢిల్లీలో జరుగుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరు: ఈనెల 26న జిల్లా యువజన ఉత్సవాలు


