AKP: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం నర్సీపట్నంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి, పెదబొడ్డేపల్లి శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
శివాలయాలకు పోటెత్తిన భక్తులు


