KDP: బద్వేలులో కార్తీక పౌర్ణమి సందర్భంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆలయ ప్రాంగణాల్లో గొడుగులనే నాగశేషులుగా అలంకరించి దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాల వెలుగులతో శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా.. భక్తులు భక్తిశ్రద్ధలతో శివయ్యను దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు


