హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంగినపూడి బీచ్‌లో ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం

కృష్ణా: కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం వైభవంగా జరుగుతోంది. కోయంబత్తూరు నుంచి వచ్చిన ఈశా బృందం కైలాస వాద్యాలతో పల్లకి ఊరేగింపు నిర్వహిస్తోంది. డమరుక నాదాలు, శివనామస్మరణతో సాగర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదియోగిని దర్శించుకుంటున్నారు.