విజయనగరం: జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో ఆగి ఉన్న లారీని జీపు వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం


