హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

W.G: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఆకివీడు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడా యి. తెల్లవారిన జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు వెళ్లి 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆకివీడు, ఐ భీమవరం, ధర్మాపురం, తదితర ప్రాంతాలల్లో శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.