హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓఎన్‌జీసీ సైట్‌లో విషాదం.. యువకుడు మృతి

కోనసీమ: ఆలమూరు మండలం పినపళ్ల ఓఎన్‌జీసీ సైట్‌లో రసాయనాల చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. పశువుల కోసం పచ్చగడ్డి తెచ్చేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరగగా, గాలింపు చర్యల అనంతరం రాత్రి 11 గంటలకు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో పినపళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి.