హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన బియ్యం పంపిణీ

ATP: రాయదుర్గం పట్టణంలోని నేతాజీ రోడ్డులోని చౌక దుకాణంలో ధరణి నాణ్యమైన బియ్యం పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సూర్యప్రతాప్ తెలిపారు. దుకాణంలో కిలో కెఎన్ఎం రకం రూ.50ల చొప్పున 26 కిలోల బస్తా రూ.1300లకు అందిస్తున్నారు. ఒక రేషన్ కార్డుకు 26 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు, లబ్దిదారులు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలని పేర్కొన్నారు.