కర్నూలు: బసలదొడ్డి గ్రామంలో కోసిగి సీఐ మంజునాథ్ ఆధ్వర్యంలో పెద్దకడబూరు పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 24 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బసలదొడ్డిలో పోలీసుల తనిఖీలు.. 24 బైక్లు స్వాధీనం


