హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వర్షప్రభావం-గందరగోళంలో వరి రైతులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో వరి రైతులు వర్షాలుపడే అవకాశం ఉందని APSDMA తెలియజేయడంతో హుటాహుటిన కోత కోసిన పంటను పోగుచేసుకోవడానికి శ్రమిస్తున్నారు. ఈ సంవత్సరం ఆకస్మిక తుపాన్ల వలన రైతు అన్ని రకాలుగా నష్టపోతున్నామని, పంట కూడబెట్టుకోకపోతే వర్షంలో తడిసి మొలకలు వచ్చి తీవ్ర నష్టం తప్పదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.