హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25.2 క్వింటాళ్ళ రాయితీ శనగ విత్తనాల పట్టివేత

ప్రకాశం: గిద్దలూరు మండలం పొదలకొండపల్లె గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రాయితీ శనగ విత్తనాలను మండల వ్యవసాయాధికారి ఎం. విజయ భాస్కర్ సోమవారం దాడి చేసి పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు ఏ.వో తనిఖీలు చేపట్టారు. 25.2 క్వింటాళ్ళ మేర అక్రమంగా నిల్వ ఉంచిన 126 బస్తాల శనగ విత్తనాలను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. 6ఏ కేసు నమోదు చేసినట్లు ఏ.వో తెలిపారు.