హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థినుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'

కృష్ణా: గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ‘విద్యార్థినీ.. జర భద్రం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ.. విద్యార్థినులు తమకు ఎదురయ్యే అనుచిత సంఘటనలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.