హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'18 ఏళ్లు నిండితే ఓటర్‌గా నమోదు చేసుకోవాలి'

E.G: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను సోమవారం ఆదేశించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.