CTR: శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల అనంతరం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ కాగా, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు జరగనున్నాయి. 27న సంకటహర గణపతి వ్రతం నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలియజేశారు. సాయంత్రం స్వామివారికి స్వర్ణ రథోత్సవం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
26న కాణిపాకంలో పవిత్రోత్సవాలు


