హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనసభద్ర గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు

PPM: పనసభద్ర గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు మంగళవారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్‌లో సీజన్  రైతులు వేసిన పంట చేతికి అందుతున్న తరుణంలో, పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఏనుగులను తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.