హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుది విడత పంచాయతీ ఎన్నికలకు 9,482 నామినేషన్లు

NLR: జిల్లాలో 3వ దశ తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సర్పంచ్ స్థానాలకు 1,686, వార్డు సభ్యుల స్థానాలకు 7,796 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 27 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. తుది విడతలో 13 మండలాల పరిధిలో 216 సర్పంచ్, 2,004 వార్డు స్థానాలకు డిసెంబర్ 2న ఎన్నికలు నిర్వహించనున్నారు.