అన్నమయ్య జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అక్రమ నగదు, మద్యం, బహుమతుల రవాణాను అడ్డుకునేందుకు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాల డిక్కీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో ముమ్మర వాహన తనిఖీలు


