హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కృష్ణమ్మ ఒడిలో కార్తీక దీపాల వెలుగులు

NTR: కార్తీక పౌర్ణమి సందర్భంగా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామంలో కృష్ణానది తీరం భక్తిభావంతో వెలిగిపోయింది. తెల్లవారుజామునే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో కార్తీక దీపాలను వదిలారు. దీపాల కాంతులతో కృష్ణమ్మ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల శివనామస్మరణతో ముత్యాల గ్రామం మార్మోగింది.