కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో క్లీనర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి


