హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసం దేవాలయాలకు పోటెత్తిన భక్తజనం

పల్నాడు: కార్తీక పౌర్ణమి సందర్భంగా రొంపిచర్ల మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వడ్లమూడివారిపాలెం, రొంపిచర్ల, విప్పర్లలోని శివాలయాల్లో భక్తులు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడ్లమూడి వారి పాలెంలోని శ్రీ గంగా పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి వార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.