హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరవల్లీ హైవేపై రోడ్డు ప్రమాదం

కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లీ జాతీయ రహదారి-16పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.