AKP: నర్సీపట్నం మండలంలో సర్పంచ్, వార్డ్ మెంబర్ల నామినేషన్ పర్వం ముగిసింది. మూడు రోజులలో మండలం మొత్తం 12 పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు 58 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా 12 మంది నీలంపేట గ్రామం నుంచి నామినేషన్లు వేశారు. వార్డు మెంబర్ల నామినేషన్లు పరిశీలిస్తే మొత్తం 355 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా 52 మంది చెట్టుపల్లి గ్రామంలో నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ స్థానాలకు 58 మంది పోటీ


